*అత్యవసర సేవలకు అండగా నామ సుభద్రమ్మ మోరియల్ ట్రస్ట్*
*పులిలోంక చర్చిలో 50 వెయ్యిల విలువగల ఫ్రిజర్ అందజేత*
*భవిషత్తులో మరిన్ని సేవలు కొసనాగుతాయి : మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్*
జహీరాబాద్, ప్రజావాణి, నవంబర్ 15: న్యాల్‌కల్ మండలంలో అత్యవసర సేవలకు మద్దతుగా పార్దివదేహం ఉంచేందుకు నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్ న్యాల్‌కల్ మండలంలోని పులిలోక లోని చర్చి పాస్టర్‌కు 50,000 రూపాయల విలువైన ఫ్రీజర్ బాక్స్‌ను అందించారు. పులిలోక సమీపంలోని చర్చి పాస్టర్, దైవజనులు ప్రశాంత్ బెంజిమన్ గారి అభ్యర్థన మేరకు ఆదివారం నాడు చర్చ్ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని ఈ విరాళం అందజేశారు. మండలంలో అత్యవసర పరిస్థితుల్లో చనిపోయిన వారి పార్థివ దేహాలను ఉంచేందుకు పాస్టర్ బృందం గత కొన్ని రోజులుగా ఉచితంగా సేవ చేస్తున్నారని వారు చేస్తున్న సేవకు మద్దతుగా ఈ సహాయం అందించామని, వారు చేస్తున్న ఈ సమాజ సేవ అభినందనీయమని ట్రస్ట్ అధ్యక్షుడు నామ రవి కిరణ్ తెలిపారు.. ఇట్టి సేవను అవసరమగు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు.. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దీపక్ అప్పి రాజ్, గంగ్వార్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు మిర్జాపూర్ వినోద్, వడ్డీ ఆనందీశ్వర్, కాజా, విశాల్ తదితరులు పాల్గొన్నారు..