prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 12:26 pm Digital Edition : PRAJA VANI

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

*అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

*నెహ్రూ వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి*

*చిలుకూరు, నవంబర్ 14 (ప్రజావాణి)*: భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని చిలుకూరు అంగన్వాడీ కేంద్రం-4లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనగా, జవహర్‌లాల్ నెహ్రూ వేషధారణలో వచ్చిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు సిరికొండ కవిత మాట్లాడుతూ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు బాలలంటే ఎంతో ఇష్టమని, అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకుంటారని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారులు నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతకు ప్రతిరూపాలుగా ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో బాలలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.