హుస్సేన్ నాయక్ సహకారం..
నెల్లికుదురులో సోలార్ లైట్స్ ఏర్పాటు..
ప్రజావాణి,నెల్లికుదురు: మండల కేంద్రంలో నెల్లికుదురులో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గుగులోతు హుస్సేన్ నాయక్ సహకారంతో ఎన్టిపిసి సంస్థ సిఎస్ఆర్ నిధుల ద్వారా సోలార్ లైట్ల ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల శాఖ అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలోని నెల్లికుదురులో వెలుగుల కోసం సోలార్ లైట్లు తమ అభ్యర్థన మేరకు హుస్సేన్ నాయక్ మంజూరు చేయించి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో బిజెపి అధికారం లేనప్పటికీ హుస్సేన్ నాయక్ సి ఎస్ ఆర్ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ లు, ఉన్నత విద్య అభ్యసించే వారికి లాప్టాప్ లు ,రైతులకు స్ప్రే పంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు సైకిళ్ళు అందజేశారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదగిరి రెడ్డి, వెన్నాకుల శ్రీనివాస్,గడ్డం యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.