prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:29 am Digital Edition : PRAJA VANI

వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి బాల్మూరి వెంకట్‌కు వినతి

వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి బాల్మూరి వెంకట్‌కు వినతి

* తెలంగాణ ఉద్యమకారుడుపత్తి వేణుగోపాల్ రెడ్డి

జమ్మికుంట నవంబర్ 13 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లావీణవంకమండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ కి వినతిపత్రం అందజేయడం జరిగిందివిద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వీణవంక మండల అభివృద్ధికి సాంకేతిక విద్య ఎంతో అవసరమని వివరించడం జరిగింది. మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం పాత జెడ్పీహెచ్ఎస్ భవనం ఇతర భవనాలు, అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నందున పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు వీణవంక అనుకూలంగా ఉంటుందని తెలియజేయడం జరిగిందిఈ కళాశాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు మండల విద్యా, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని వివరించి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనికోరడంజరిగిందిదీనిపై సానుకూలంగా స్పందించిన బాల్మూరి వెంకట్ గారు త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వీణవంకలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తానని హామీ ఇచ్చారు

పత్తి వేణుగోపాల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుడు