లక్ష్మీదేవిపేట పీఏసీఎస్ చైర్మన్ గా చెన్నోజు సూర్యనారాయణ నియామకం
వెంకటాపూర్ నవంబర్ 14 (ప్రజావాణి)
లక్ష్మీదేవిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా చెన్నోజు సూర్యనారాయణ నియామకం
ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన మంత్రి సీతక్కకు చెన్నోజు సూర్యనారాయణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కట్టెకొల్ల వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గాజవేణి రమేష్ ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
