రంగసముద్రం వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా పసుపుల శృతి • అధికారికంగా ప్రకటించిన ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి
గ్రామ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని సూచన • హర్షం వ్యక్తం చేసిన స్థానిక పార్టీ శ్రేణులు, నాయకులు పోరుమామిళ్ల (కడప జిల్లా):నవంబర్ 14ప్రజావాణి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోరుమామిళ్ల మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మండలంలోని రంగసముద్రం గ్రామపంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పసుపుల శృతి పేరును ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.గ్రామ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన...