prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:49 am Digital Edition : PRAJA VANI

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి..

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి..
ప్రజావాణి, ఇనుగుర్తి /నెల్లికుదురు: హిందువులకు ప్రాముఖ్యమైన నాగుల చవితి పండుగను మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి,నెల్లికుదురు మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాలలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. కార్తీకమాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుద్ధ చవితి రోజున ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.ఇనుగుర్తి మండలం మీట్యా తండా సమీపంలోని నాగదేవత ఆలయం పుట్ట వద్ద చిన్న నాగారం తో పాటు వివిధ గ్రామాల భక్తులు ఆవు పాలు,పూజా ద్రవ్యాలు సమర్పించుకుని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తమ పిల్లలకు క్షేమం కుటుంబ సౌభాగ్యం కోరుతూ ఉపవాస దీక్షలు ఆచరించారు.