బాలాజీ నాయక్ కు ఎమ్మార్పీఎస్ పరామర్శ
ప్రజావాణి,నెల్లికుదురు: కాంగ్రెస్ జిల్లా నాయకులు గుగులోతు బాలాజీ నాయక్ కు ఇటీవల పితృ యోగం జరిగింది. మండల ఎంఆర్పిఎస్,ఎంఎస్పి నాయకులు శుక్రవారం మండలంలోని రత్తిరామ్ తండా బాలాజీ నాయక్ గృహానికి చేరుకుని స్వర్గీయ దస్రునాయక్
చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాలాజీ నాయక్ ను పరామర్శించి ఈ దుఃఖ సమయంలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. పరామర్శించిన వారిలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి మండల అధ్యక్షులు తూల్ల వెంకన్న,కడారి ఐలయ్య,జర్నలిస్టు హెచ్చు మహేందర్, హెహ్ రవి తూల్ల వెంకన్న,హెచ్ అశోక్, తూల్ల వివేక్ ఉన్నారు.