prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 1:19 pm Digital Edition : PRAJA VANI

బాలల దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్‌లో గ్రామసభ

బాలల దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్‌లో గ్రామసభ

బెజ్జంకి,నవంబర్ 14 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎర్రల జానకిరాజు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.ఐ సందర్బంగా సర్పంచ్ ఎర్రల జానకి -రాజు గ్రామసభలో మాట్లాడుతూ పిల్లల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాల్య వివాహాల నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చించి,పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం కాకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామంలోని పాఠశాలల అభివృద్ధి, పిల్లల సమగ్ర సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు,తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, తడకపల్లి పవన్, కల్లేపల్లి లక్ష్మీ శ్రీనివాస్, చాతవేణి మహేష్, సొల్లు బాలయ్య, న్యాలం శారద శ్రీనివాస్, కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, మాజీ సర్పంచ్‌లు పులి శ్రీనివాస్, మచం శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పైడిపల్లి శంకర్, గర్రెపల్లి అంజయ్య, పిల్లలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.