పోరుమామిళ్ల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై పోలీసుల నిఘా; క్లస్టర్ కేంద్రాలను పరిశీలించిన సీఐ ఆర్.జి. సుబ్రహ్మణ్యం
పోరుమామిళ్ల (కడప జిల్లా):నవంబర్ 14 ప్రజావాణి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మైదుకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి స్వీయ పర్యవేక్షణలో పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.జి.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసు బృందాలు నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. నామినేషన్ క్లస్టర్ కేంద్రాల తనిఖీ: ఎన్నికల నిర్వహణలో భాగంగా పోరుమామిళ్ల మండలంలో ఏర్పాటు చేసిన ప్రధాన...