పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14
వేములపల్లిలో బొంగర్ల నాగమ్మ మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు – కుటుంబానికి *రూ.5,000 ఆర్థిక సహాయం*
వేములపల్లి గ్రామానికి చెందిన బొంగర్ల నాగమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న తెలంగాణ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వెంటనే వేములపల్లి గ్రామానికి విచ్చేసి, నాగమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ *రూ.5,000 ఆర్థిక సహాయం* అందించారు.
ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెగట్టి రవీందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొని బొంగర్ల నాగమ్మ కి నివాళులర్పించారు.