prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:40 am Digital Edition : PRAJA VANI

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు వాయిదా

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు వాయిదా

డిసెంబర్ 3న రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం’ 50వ వార్షికోత్సవ వేడుకలు 14 నవంబర్ 2026న జరగవలసిన వేడుకలు అనివార్య కారణాల రీత్యా వాయిదా వేయడమైనది .

వాయిదా పడిన ఈ వేడుకలను డిసెంబర్ 3వ తేదీ న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ మేరకు వేడుకల కమిటీ చైర్మన్ డాక్టర్ జె.బి. రాజు, సంఘం అధ్యక్షులు సిహెచ్. ఆవిలయ్య, ప్రధాన కార్యదర్శి బి. నాగరాజు సంయుక్తంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

14వ తేదీ కార్యక్రమానికి హాజరు కావాలనుకున్న సభ్యులు, శ్రేయోభిలాషులు, అంబేద్కర్ అభిమానులు గమనించి, డిసెంబర్ 3న జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.