prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 4:55 pm Digital Edition : PRAJA VANI

చదువుతో ఎదగాలి.. క్రీడలతో రాణించాలి.. ఉన్నత శిఖరాలను చేరాలి!” – ACP ప్రశాంత్ రెడ్డి సందేశం

**చదువుతో ఎదగాలి.. క్రీడలతో రాణించాలి.. ఉన్నత శిఖరాలను చేరాలి!” – ACP ప్రశాంత్ రెడ్డి సందేశం**

హనుమకొండ జిల్లా, వేలేరు మండలం:
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షతన బాలల గ్రామసభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్, వేలేరు ఎస్ఐ దూదిమెట్ల నరేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో ఎదగాలని, క్రీడల్లో రాణించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. బాలల గ్రామసభల ద్వారా విద్యార్థుల సమస్యలను గుర్తించి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన పాఠశాల వసతులు కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, పంచాయతీ కార్యదర్శి విజయ, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.