కౌలాస్ గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో
చదువు చెప్పిన చిన్నారులు…మురిసిన ఉపాధ్యాయులు
-ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.
-ఉపాధ్యాయులుగా మారి ఆకట్టుకున్న చిన్నారులు.
ఉపాధ్యాయులుగా మాది ఆకట్టుకున్న చిన్నరులకు బహుమతులు అందజేసిన సర్పంచ్ విద్యా బలరాం.
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 13
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ విద్యా బలరాం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషిస్తూ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో పాఠాలు బోధించడం,వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ,విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని సర్పంచ్ విద్య బలరాం పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, శ్రీనివాస్, గ్రామ ఉపసర్పంచ్ పూజారి గణేష్, సర్పంచ్ కుమారుడు రాజేష్, తెరాస గ్రామ అధ్యక్షుడు మంత్రి సాయిలు, మాజీ తెరాస బొగ్గుల గంగాధర్, విశ్వనాథ్ పంతులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.