కొండగట్టులో ఆరు రోజుల పాటు దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేత
చందనోత్సవం, మహా సంప్రోక్షణ కార్యక్రమాల నేపథ్యంలో నవంబర్ 15 నుంచి 20 వరకు కొండగట్టు అంజన్న ఆలయంలో ఆర్జిత సేవలు, వాహన పూజలు, వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ ఆరు రోజులు మూలవిరాట్టు దర్శనం ఉండదని, భక్తుల సౌకర్యార్థం బాలాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సిఫారసు లేఖలు అనుమతించబడవని స్పష్టం చేశారు. నవంబర్ 21 నుంచి నిజరూప దర్శనంతో పాటు అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయని, భక్తులు సహకరించాలని దేవస్థానం కోరింది.