కవలకుంట్ల తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వీరపోగు బాలయ్య ఖరారు
బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి నిర్ణయం పోరుమామిళ్ల (వైఎస్ఆర్ కడప జిల్లా):కవలకుంట్ల నవంబర్ 14 ప్రజావాణి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మండలంలోని కవలకుంట్ల (కవలకుంట) గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ,వీరపోగు బాలయ్య పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఖరారు చేసింది. బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఈ మేరకు బాలయ్య ను అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ,రాబోయే ఎన్నికల్లో...