*ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావాలంటూ ఎమ్మెల్యేకి ఆహ్వానం…*
*ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 14*
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ అనంతరం శివారులో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల ఆలయంలో ఈ నెల 17వ తేదీ మంగళ వారం రోజు ఉదయం 11 గంటలకు నిర్వహించ నున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్స వానికి హాజరుకావాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ , భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేష్ యాదవ్ , 12వ వార్డు కౌన్సిలర్ తోటకూరి విజయలక్ష్మి తదితరుల తో కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ బంజారా హిల్స్ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అంద జేశారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు అమ్మవారి కళ్యాణోత్స వాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో , వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర కళ్యాణ మహోత్సవానికి భక్తులు , ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మ వారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.