prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 10:42 am Digital Edition : PRAJA VANI

సిరిపల్లి తండా-3 అభివృద్ధికి సర్పంచ్ క్రాంతిలాల్ ప్రత్యేక చొరవ!

*సిరిపల్లి తండా-3 అభివృద్ధికి సర్పంచ్ క్రాంతిలాల్ ప్రత్యేక చొరవ!*

*ఉపాధి హామీ గ్రామసభ నిర్వహణ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడి*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 13:–
కుబీర్ మండలం సిరిపల్లి తండా-3లో గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ క్రాంతిలాల్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామసభ నిర్వహించగా, ఏపీవో హర్లాల్ హాజరై పథకానికి సంబంధించిన అంశాలను గ్రామస్థులకు వివరించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల సమక్షంలో కార్యదర్శి సంతోష్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ క్రాంతిలాల్ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తాననే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ క్రాంతిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో హర్లాల్, కార్యదర్శి సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.