రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అండ

*రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అండ* *శివ నాయక్ వైద్య చికిత్స కోసం రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు* రంగారెడ్డి జిల్లా నవంబర్ 12 (ప్రజావాణి): మంచాల సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రం అందజేత మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన రత్నావత్ శివ నాయక్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తలకు పెద్ద గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో...