prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 4:29 pm Digital Edition : PRAJA VANI

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

• కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల వైద్యనాథ్ (రాజు పటేల్)

ఆందోల్ | నవంబర్ 13 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల వైద్యనాథ్ (రాజు పటేల్) కోరారు.

ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని పేర్కొన్నారు.

10వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువత ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,288 వేతనంతో పాటు ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు.

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని రాజు పటేల్ పిలుపునిచ్చారు.