మంచాల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు

*మంచాల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు* *బస్సు షెల్టర్లు, మహిళలకు మరుగుదొడ్లు కరువు!* *ఖాళీ స్థలాలు నిరుపయోగం.. ఆక్రమణలకు అవకాశం.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు* మంచాల, నవంబర్ 13 (ప్రజావాణి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండేందుకు బస్సు షెల్టర్లు, అత్యవసర అవసరాల కోసం మరుగుదొడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. మంచాల కేంద్రంలోని జాపాల్ రోడ్డు నుంచి ఆరుట్ల వెళ్లే...