పిల్లల చదువుపై కలెక్టర్ ఆరా.. భవిష్యత్తుపై భరోసా
పిల్లల చదువుపై కలెక్టర్ ఆరా.. భవిష్యత్తుపై భరోసా! తరగతి గదిలో విద్యార్థులతో ముఖాముఖి! చదువులో వెనుకబడిన వారిని గుర్తించాలని ఆదేశం! మానుకోట విద్యా ఫలితాలే లక్ష్యం.. కేసముద్రం నవంబర్ 12,ప్రజావాణి. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది.. వారికి అందే విద్యా ప్రమాణాలే రేపటి సమాజ ప్రగతికి పునాది. అందుకే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతోందా? చదువులో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? బోధించిన పాఠాలు ఎంతవరకు అర్థమవుతున్నాయి? అనే అంశాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. అధికారుల నివేదికలకే...