prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 2:24 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పాతగూడూర్ ZPHSలో శ్రీరామ్ గ్రూప్ ‘మిషన్ టెన్త్ క్లాస్’ విజేత కు రూ.10,000 చెక్కు అందజేత

ఎండపల్లి మండలం పాతగూడూర్ జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మిషన్ టెన్త్ క్లాస్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల ప్రథమ స్థానం సాధించిన తాటిపల్లి సహర్షిత ప్రతిభను అభినందిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు శ్రీరామ్ గ్రూప్ తరఫున 10వేల రూపాయల చెక్కును బహుమతి గా అందజేశారు. ప్రస్తుత పదో తరగతి విద్యార్థులలో స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్లు పాల్గొని విద్యార్థులను అభినందించారు.