prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 8:08 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

*ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం*

* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి*:-

విద్యార్థులలో చదువుతో పాటు క్రీడా స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉద్దేశ్యంతో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ (ఎన్పిఎల్) క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకలకు పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి, డీన్ వెంకటస్వామి,ఈ చాంప్స్ విపి సంధ్య, ఈ కిడ్స్ విపి స్రవంతి, ఏజిఎం ఎనలిస్ట్ రాజేందర్, ఓం శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏజిఎం చైతన్య రావు మాట్లాడుతూ, విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. నారాయణ విద్యా సంస్థలు అకడమిక్స్ తో పాటు సహ పాఠ్యాంశాలు, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తాయని తెలిపారు. ఈ ఎన్పిఎల్ ద్వారా విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభ వెలుగులోకి వస్తుందని, టీమ్ వర్క్, పోటీతత్వం పెంపొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ జట్లుగా ఏర్పడిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటుకుంటున్నారు. తోటి విద్యార్థులు కేకలు వేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.