గ్రామ సమరానికి ఖాకీ కవాతు.. నామినేషన్ కేంద్రాలపై పోలీస్ నిఘా!

కలసపాడు కాశి నాయన మండలంలోని క్లస్టర్ కేంద్రాలను పరిశీలించిన సీఐ సుబ్రహ్మణ్యం 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినతరం.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు, అభ్యర్థులు సహకరించాలని పిలుపు కలసపాడు,నవంబర్ 14 (ప్రజావాణి): గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోరుమామిళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సుబ్రహ్మణ్యం శుక్రవారం కలసపాడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. కలసపాడు ఎస్ఐ...