prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 8:12 am Digital Edition : PRAJA VANI

ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

*ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా*

– *అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది*

– *ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 12 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు.

గురువారం సచివాలయంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రూ.18 వేల స్థిర వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు, సెలవులు, పదోన్నతులు, కనీస వేతనం తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఆశా వర్కర్లు ప్రజలకు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే గుర్తించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆశా వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.