prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 7:41 pm Digital Edition : PRAJA VANI

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం…

*అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం…*

*ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 13*

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయ కత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రా లను అర్హులైన లబ్ధి దారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య అంద జేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదలు , వృద్ధులు , వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్య మని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
పెన్షన్లు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తా యని , వారి జీవనోపాధికి ఆర్థిక భరోసా కల్పిస్తా యని పేర్కొన్నారు.
ఆలేరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం , అభి వృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ పనిచేస్తానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు.