అటకెక్కిన అల్పాహార పథకం

*అటకెక్కిన అల్పాహార పథకం!* *నాలుగు నెలలకే నిలిచిన ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమం* రంగారెడ్డి జిల్లా నవంబర్ 13 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన అల్పాహార పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం కొద్దికాలానికే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం దోశ, ఇడ్లీ, ఉప్మా, పాలు అందించాల్సి ఉండగా ప్రస్తుతం అల్పాహారం అందడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అల్పాహారం అందుతుందనే నమ్మకంతో...