**హసన్పర్తిలో బీజేపీకి యువజన మద్దతు.. భారీగా పార్టీలో చేరిన యువకులు!**
హసన్పర్తి:
హసన్పర్తి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మారం తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పలువురు యువకులు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ గారు, రాష్ట్ర నాయకులు గురుమూర్తి శివకుమార్ గారు విచ్చేసిన నాయకులు నూతనంగా పార్టీలో చేరిన యువకులకు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముక అని, దేశ అభివృద్ధి, సమాజ మార్పు కోసం యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బీజేపీ సిద్ధాంతాలు, నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని, యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
హసన్పర్తి మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు.
పార్టీలో చేరిన వారు పెద్దమ్మ హర్ష,చెన్నబోయిన సాయి కృష్ణ,పోతన రాహుల్,రామ్,రోహిత్,సాయి మోహన్,ప్రశాంత్, నిఖిల్,భరత్,అరుణ్, నాగసాయి, అక్షిత్.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మారుపెల్లి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి,పెంబర్తి సర్పంచ్ తాళ్ళపల్లి కుమారస్వామి, జిల్లా ట్రేడ్ సెల్ కన్వీనర్ చకిలం రాజేశ్వరరావు, నాయకులు పెద్దమ్మ శ్రీనివాస్ దాసరి రాజు, పట్టాభి,ప్రభాకర్, కందుకూరి శ్రీకాంత్ చెల్పూరు శంకర్ రావుపాలరెడ్డి దాది మధుసూదన్, ప్రవీణ్ రెడ్డి ,రవితేజ ,రామిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, నూతనంగా పార్టీలో చేరిన యువకులు తదితరులు పాల్గొన్నారు