prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 7:18 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

వైద్య విద్యతోనే విద్యార్థుల భవిష్యత్

 

తొర్రూర్ హాస్పటల్ ను సందర్శించిన దంతాలపల్లి హై స్కూల్ విద్యార్థులు

– హాస్పటల్ సూపర్డెంట్ సుగుణాకర్ ,ఆర్ ఎం ఓ డాక్టర్ విజయ్ కుమార్

దంతాలపల్లి
నవంబర్ 12(ప్రజావాణి)

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులో భాగంగా హెల్త్ టీచర్ ఉదయశ్రీ ఆధ్వర్యంలో తొర్రూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఈ కార్యక్రమంలో హాస్పటల్ సూపర్డెంట్ సుగుణాకర్, ఆర్ ఎం ఓ డాక్టర్ విజయకుమార్ విద్యార్థులకు శుభ్రత, ప్రథమ చికిత్స, అనేక రకాల పలు అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు అదేవిధంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.విద్యార్థులు ఆరోగ్య అంశాలపై అవగాహన పెంపొందించుకొని ఉన్నత స్థాయిలో ఆరోగ్య విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, బ్యూటిషన్ ఉపాధ్యాయురాలు సమత , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.