వేసవిలో నీటి ఎద్దడి రాకుండ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
వేసవిలో నీటి ఎద్దడి రాకుండ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి మద్దూరు ఎంపిడిఓ శ్రీనివాస్ మద్దూరు నవంబర్12, ప్రజా వాణి, ఎల్ నేనో ప్రభావం ద్వారా రాబోవు వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనీ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో అన్ని గ్రామాల సర్పంచులు, మండల పంచాయతీ అధికారి జి వెంకటేశ్వర్లు,మిషన్ భగీరథ ఏఈ ప్రవళిక, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.