**వేలేరులో నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి..**
వేలేరు, హనుమకొండ జిల్లా:
వేలేరు మండల కేంద్రంలో నిర్వహించిన నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి గారి అన్నగారైన బిల్లా సురేష్ – వింధ్య దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హాజరై, నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని బిల్లా సురేష్ – వింధ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.