prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 4:41 pm Digital Edition : PRAJA VANI

వి బి- జి రమ జి , పథకం కింద మంజూరైన 10 లక్షల, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు

*వి బి- జి రమ జి , పథకం కింద మంజూరైన 10 లక్షల, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు*

*మన ప్రజావాణి మధిర ఆర్ సి నవంబర్ 12*

మధిర మండలం నిదానపురం గ్రామంలో, ప్రభుత్వం హై స్కూల్ కు సరైన ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు బి ఎస్ ఎన్ ఎల్ అడ్వాన్స్ సరి,కమిటీ మెంబర్ నిదానపురం వాసి, అమర వాది సత్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన డాక్టర్ కోటా రాంబాబు ద్వారా, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డిని కలిసి, ఆయనకు సమస్య వివరించగా వెంటనే స్పందించిన ఆయన నిదానపురం గ్రామానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది, ఈరోజు ఆ ప్రహరీ గోడ రాయికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, డాక్టర్ కోటా రాంబాబు చేతుల మీదుగా, శంకుస్థాపన చేయడం జరిగింది ,ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంపటి రత్నకుమారి అమరవాది సత్యనారాయణ రెడ్డి బాదం పద్మ గుండా వీరారెడ్డి గ్రామ నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్ వెంపటి,రమేష్ బాదం సత్యనారాయణ రెడ్డి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు