**రైతు సంక్షేమానికి పెద్దపీట.. వేలేరులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి!**
వేలేరు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) పొందాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా, ప్రభుత్వం కల్పిస్తున్న కొనుగోలు కేంద్రాల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, గౌరవ సర్పంచులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.