రాష్ట్రంలో గృహప్రవేశాల సందడి.. అనంతగిరిలో పేదల ఎదురుచూపులే
ప్రజావాణి అనంతగిరి రాష్ట్రంలో గృహప్రవేశాల సందడి.. అనంతగిరిలో పేదల ఎదురుచూపులే! ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కానరాని స్పష్టత.. అర్హుల ఎదురుచూపులకు ఎప్పుడు తెర? అధికారుల నిర్లక్ష్యమా.. ప్రజాప్రతినిధుల అలసత్వమా? అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అనంతగిరి మండలంలోని నిరుపేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాల సందడి కనిపిస్తుంటే.. అనంతగిరి మండలంలో మాత్రం అర్హులైన పేదల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఇళ్ల మంజూరుపై ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడంతో తమ సొంతింటి కల...