prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 10:37 am Digital Edition : PRAJA VANI

పేద కుటుంబాలకు అండగా కడియం శ్రీహరి.. ఐదు కుటుంబాలకు రూ.1.82 లక్షల CMRF సాయం!

**పేద కుటుంబాలకు అండగా కడియం శ్రీహరి.. ఐదు కుటుంబాలకు రూ.1.82 లక్షల CMRF సాయం!**

వేలేరు మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐదు పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.1,82,000 ఆర్థిక సాయం అందింది.

వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఈ సమస్యను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా గురువారం వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఐదు కుటుంబాల సభ్యులకు CMRF చెక్కులను అందజేశారు.