prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 1:12 pm Digital Edition : PRAJA VANI

తవణంపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండో విడత శిక్షణ

తవణంపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండో విడత శిక్షణ

తవణంపల్లి, నవంబర్ 12 (ప్రజావాణి): మండల పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండో విడత (రౌండ్‌-2) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, చిన్నారులకు అందించాల్సిన సేవలు, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేలా కృషి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ సేవల నాణ్యతను మెరుగుపరిచి, చిన్నారుల ఆరోగ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో CDPO, H.M., ICDS సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.