ఘట్కేసర్లో ‘నేను సైతం–2.0’పై అవగాహన.. సీఐ పి. కిరణ్ ఆధ్వర్యంలో ప్రచారం
ఘట్కేసర్, నవంబర్ 11: ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నేను సైతం–2.0’ (సెక్యూర్ టుడే–సేఫ్ టుమారో) కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ సీఐ పి. కిరణ్ ప్రత్యేకంగా పాల్గొని సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఇంటి వద్ద, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు, ఇతర నేరాలను నియంత్రించవచ్చని సీఐ కిరణ్ సూచించారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల...