prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 10:08 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌లో ‘నేను సైతం–2.0’పై అవగాహన.. సీఐ పి. కిరణ్ ఆధ్వర్యంలో ప్రచారం

 

ఘట్‌కేసర్, నవంబర్ 11: ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నేను సైతం–2.0’ (సెక్యూర్ టుడే–సేఫ్ టుమారో) కార్యక్రమంలో భాగంగా ఘట్‌కేసర్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ ప్రత్యేకంగా పాల్గొని సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు.

ప్రతి ఇంటి వద్ద, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు, ఇతర నేరాలను నియంత్రించవచ్చని సీఐ కిరణ్ సూచించారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అత్యవసర సమయాల్లో పోలీస్ సేవలకు 100, సైబర్ నేరాలకు 1930, మహిళల సహాయం కోసం 181/1091, బాలల సహాయం కోసం 1098 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ ఎస్సై శేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.