prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 6:24 pm Digital Edition : PRAJA VANI

కోటి దీపోత్సవానికి భూమి పూజ.. వైభవంగా ప్రారంభమైన ఏర్పాట్లు

*కోటి దీపోత్సవానికి భూమి పూజ.. వైభవంగా ప్రారంభమైన ఏర్పాట్లు*

*షాద్‌నగర్: 2026 నవంబర్ 26, 27, 28, 29 తేదీలలో నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.*

షాద్నగర్ అక్టోబర్ 12(మన ప్రజా వాని )

భూమి పూజ కార్యక్రమంతో కోటి దీపోత్సవ ప్రాంగణానికి కొత్త కళ సంతరించుకుంది. ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న ఈ పవిత్ర ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోటి దీపోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.

కోటి దీపోత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే నాలుగు రోజులపాటు జరిగే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కోటి దీపోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు సింగారం శ్రీనివాస్, సింగారం యాదగిరి నివాస్, ప్యాట అశోక్, బర్మలి జంగయ్య, కాసోజు వంశీకృష్ణ, ఎదిర రాజేష్ గౌడ్, ప్యాట జయ శ్రీకాంత్, సన్నిధానం నరేందర్, అనురాధ, గంధం శ్రీనివాస్, అల్లం అనిల్ గౌడ్, శ్రీనివాస్ చారి, భరత సింహారెడ్డి, మేడిగ దామోదర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు రోజులపాటు భక్తి పారవశ్యంతో వెలుగులు విరజిమ్మనున్న కోటి దీపోత్సవం కోసం భక్తులు, నిర్వాహకుల్లో ఇప్పటి నుంచే ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది.