కొమురవెల్లి మండల ముదిరాజ్ నూతన కమిటీ ఎన్నిక
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం
కొమురవెల్లి మండల కేంద్రంలో గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు గీత భిక్షపతి మరియు ఉమ్మడి మత్స్యకారుల సంఘం రాష్ట నాయకులు తేలు ఇస్తారి ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కొమురవెల్లి మండల ముదిరాజ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ వివరాలు:
– అధ్యక్షులు: పుట్ట కనకరాజు
– ఉపాధ్యక్షులు: మల్లం బాలయ్య, బచ్చల శ్రీశైలం
– ప్రధాన కార్యదర్శి: సార్ల లింగం
– కార్యదర్శులు: దండు నర్సింలు, నీల కొండయ్య
– కోశాధికారి: అనబోయిన సురేష్
కమిటీ సభ్యులు:
1. పాశం స్వామి
2. నీల బిక్షపతి
3. జిల్లా కృష్ణ
4. చిలుక కనకయ్య
5. పేర్ల వెంకటేష్
6. జాప అనిత
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ముదిరాజ్ సంఘం ఐక్యత, అభివృద్ధి కోసం నూతన కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు, కుల పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.