పోరుమామిళ్ల నవంబర్ 12ప్రజావాణి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజల మద్దతు: బద్వేలు ఏఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ పోరుమామిళ్ల: బద్వేలు నియోజకవర్గంలో కూటమి పార్టీల విజయం ప్రజల తీర్పుకు నిదర్శనమని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పాలనకు ఈ విజయం ప్రతిబింబమని బద్వేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ అన్నారు. పోరుమామిళ్లలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న దూరదృష్టి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.బద్వేలు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, మార్గదర్శకత్వంలో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో బద్వేలు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకారం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మద్దతు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన విజన్ కలిగిన నాయకుడని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని నారిశెట్టి సుప్రజ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి సూర్యనారాయణ రెడ్డి ఆద్వర్యం లో మరింత కృషి చేస్తామని ఆమె తెలిపారు.