prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 8:00 am Digital Edition : PRAJA VANI

ఇల్లంతకుంటలో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

ఇల్లంతకుంటలో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

జూనియర్ కళాశాల ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా

సావనపెల్లి రిషికాంత్ ఎంపిక

ఇల్లంతకుంట, నవంబర్ 11 (ప్రజావాణి)

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎంఆర్పీఎస్ మంద రాజు ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎంఆర్పీఎస్ మండల ఇన్‌చార్జి మంద రాజు అధ్యక్షతన, ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జి ఖానాపురం లక్ష్మణ్, సీనియర్ నాయకులు గుండేటి రాజు ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది.నూతన కమిటీ అధ్యక్షుడిగా సావనపెల్లి రిషికాంత్, ఉపాధ్యక్షుడిగా అక్షయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రేణుక, కోశాధికారిగా నమిత ఎంపికయ్యారు. సహాయ కార్యదర్శులుగా వీణ, జశ్వంత్, రోహిణి, వైష్ణవి, కార్యవర్గ సభ్యులుగా యశ్వంత్, హరీష్, ఉదయ్ కుమార్, శివ, నందిని, మానస, సనలను నియమించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, మాదిగ విద్యార్థుల హక్కుల సాధనకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.