అధికారులు అసైన్డ్ భూముల్లో చేపట్టిన సర్వేలు
అధికారులు అసైన్డ్ భూముల్లో చేపట్టిన సర్వేలు ముమ్మరంగా కొనసాగుతున్న విచారణ ములుగు ప్రతినిధి (ప్రజావాణి):- వెంకటాపూర్(రామప్ప) మండలంలో రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. 368, 341, 441 సర్వే నంబర్ల పరిధిలోని అసైన్డ్ భూముల్లో అక్రమాలపై వార్తలు, ఫిర్యాదులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించి సుమారు 50 ఎకరాల్లో సర్వే చేపట్టారు. ఏ భూమి ఎవరి పేరు మీద నమోదైంది, మోకా మీద వాస్తవంగా ఎవరున్నారో కొలతలు వేసి తేలుస్తున్నారు. సాగు ఎవరు చేస్తున్నారు, ఆక్రమణ ఎక్కడ...