prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:40 pm Digital Edition : PRAJA VANI

107 ఏళ్ల ఘన చరిత్ర 108వ సంవత్సరంలోకి యూనియన్ బ్యాంక్!

107 ఏళ్ల ఘన చరిత్ర 108వ సంవత్సరంలోకి యూనియన్ బ్యాంక్!

నవంబర్ 11.ప్రజావాణి న్యూస్/ సంగెం

108 లో అడుగు పెట్టినా యూనియన్ బ్యాంక్ కేకుతో స్వాగతం పలికినబ్యాంకు మేనేజర్ బ్యాంకు బృందామంతా కలిసి ఖాతాదారులకు స్వాగతం పలికారు

• శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న బ్యాంకు.. ఖాతాదారుల నమ్మకమే అసలైన బలం!

107 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 108వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందింది.దశాబ్దాలు గడుస్తున్నా ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ ముందుకు సాగుతోంది.స్వాతంత్ర్యానికి పూర్వం ప్రారంభమైన ఈ బ్యాంకు ఎన్నో ఆర్థిక మార్పులకు, సవాళ్లకు సాక్షిగా నిలిచింది.సామాన్య ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు లక్షలాది మంది ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తూ తనదైన ముద్ర వేసుకుంది.అయితే 107 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకోవడమే కాదు నేటి పోటీ ప్రపంచంలో ఖాతాదారులకు ఎంత వేగంగా, ఎంత పారదర్శకంగా, ఎంత నాణ్యమైన సేవలు అందిస్తున్నామన్నదే అసలైన ప్రశ్న. బ్యాంకు చరిత్ర ఎంత గొప్పదో, ఖాతాదారులకు అందే సేవలు కూడా అంతే గొప్పగా ఉండాలి. సాంకేతికత పెరుగుతున్న ఈ రోజుల్లో ఖాతాదారులు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితులు లేకుండా,సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత బ్యాంకు సిబ్బందిపై ఉంది.శతాబ్దానికి పైగా సాగుతున్న ఈ ప్రస్థానం మరిన్ని విజయాలకు బాటలు వేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యూనియన్ బ్యాంక్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ చందు అసిస్టెంట్ మేనేజర్ అక్షయ్ క్యాషియర్ శివ. లావణ్య సుస్య .స్వామి .బ్యాంకు మిత్ర భవిత కవిత రజిని గోపి లాల్ రేవతి లావణ్య తదితరులు పాల్గొన్నారు