హుస్సేన్ నాయక్ సహకారం..
4 గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు..
ప్రజావాణి,నెల్లికుదురు: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ చొరవ సహకారంతో నాలుగు గ్రామాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్లాల్ తెలిపారు.మండలంలోని రత్తి రామ్ తండాలో బుధవారం సోలార్ లైట్ ఏర్పాటు పురస్కరించుకొని ఆయన పలువురితో కలిసి మాట్లాడుతూ నల్లగుట్ట తండా,మేచరాజు పల్లి,పెద్ద తండా, రత్తి రామ్ తండాలలో సరైన లైటింగ్ సిస్టం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సమస్య తీవ్రతను హుస్సేన్ నాయకుడు దృష్టికి తీసుకువెళ్లామన్నారు.దీంతో హుస్సేన్ నాయక్ ఎన్ టి పి సి,సి ఎస్ ఆర్ నిధులతో సంబంధిత సోలార్ లైట్లు మంజూరు చేయించి ఏర్పాటు చేశారన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన ఆయా గ్రామాల ప్రజలు..
గ్రామాల్లోని సమస్య పట్ల స్పందించి సోలార్ లైట్లు మంజూరు చేయించిన హుస్సేన్ నాయక్ కు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపినట్లు మదన్ లాల్ చెప్పారు.రాత్రి వేళల్లో పిల్లలు,మహిళలు,పాదచారులు వెళ్లాలంటే భయం భయంగా వెళ్లే వారని సోలార్ లైట్లు ఏర్పాటుతో వెలుగులు రావడంతో సమస్య తీరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.హుస్సేన్ నాయక్ కు రుణపడి ఉంటామని చెప్పినట్లు వివరించారు.