సి సి కెమెరాలతో గ్రామాలు సురక్షితం.. నేరాలు నియంత్రణ
బైరాన్ పల్లిలో సి సి కెమెరాలు ప్రారంభం
సిద్ధిపేట జిల్లా సీపీ సాధన రష్మీ పేరుమాల్
మద్దూరు నవంబర్11, ప్రజా వాణి,
సి సి కెమెరాల ఏర్పాటుతో గ్రామాలు సురక్షితంగా ఉండడమే కాకుండ నేరాలు అదుపులో ఉంటాయని సిద్ధిపేట సీపీ సాధన రష్మీ పేరుమాల్ అన్నారు.బుదవారం మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 25, గ్రామానికి చెందిన థాత ఇమ్మడి శ్రీదర్ రెడ్డి అందజేసిన 5 సి సి కెమెరాలను సిద్ధిపేట సి పి సాధన రష్మీ పేరుమాల్, ఏ సి పి సదానందం, గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్యలతో కలిసి ప్రారంబించారు.అనంతరం సర్పంచ్ బర్మా రాజమల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పాలక వర్గం గ్రామస్థులు సమన్వయంతో సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ సిబ్బంది చేయలేని పనులను సి సి కెమెరాలు చేస్తున్నాయని అందుకోసం ప్రతి గ్రామంలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజా ప్రతినిధులకు సలహాలు సూచనలు ఇస్తున్నామని అన్నారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మాట్లాడుతూ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వీర బైరాన్ పల్లి నేడు చరిత్ర పుటల్లో ఎక్కించకపోవడం బాధాకరమన్నారు. నిజాం సర్కార్ ను తరిమి కొట్టిన వీర బైరాన్ పల్లినీ పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎందరు నాయకులు ప్రతి ఆగస్ట్,సెప్టెంబర్ నెలలో వాగ్దానాలు చేసి ఎవరి దారిన వారు వెళ్లి పోతున్నారే తప్ప గ్రామానికి ఒరగబెట్టింది ఏమి లేదన్నారు.మీ సాయ శక్తుల మీకున్న వెసులుబాటుతో గ్రామాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చరిత్ర పుటల్లో వీర బైరాన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని బైరాన్ పల్లి చరిత్ర మీ దృష్టికి తీసుకువస్తున్నానని అన్నారు.అనంతరం గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య సి పి సాధన రష్మీ పేరుమాల్ ను బొకే అందించించి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అదే విధంగా సర్పంచ్ ను హుస్నాబాద్ ఏసిపి సదానందం శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ నేపధ్యంలో గ్రామాన్ని సందర్శించిన సి పి సాధన రష్మీ పేరుమాల్ రజాకార్లు నిర్మించిన బురుజు కట్టడాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో చేర్యాల సి ఐ రమేశ్, మద్దూరు, కొమురవెల్లి ఎస్సైలు మహమ్మద్ ఆసీఫ్,మహేష్, ఉప సర్పంచ్ సిద్ధులు, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు,గ్రామస్థులు పాల్గొన్నారు.