*సిద్ధన్నపేట అభివృద్ధికి సహకరిస్తా* *గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు
నంగునూరు, నవంబర్ 11: గ్రామ ప్రజలందరి సహకారంతో సిద్ధన్నపేట గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సిద్దన్నపేట గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని కోకాపేటలోని హరీశ్‌రావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న...