prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 12:56 pm Digital Edition : PRAJA VANI

శివుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

శివుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

రైకల్‌దేవుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డాక్టర్ దాసరి మమతా రెడ్డి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 11

ఎలిగేడు మండలం రైకల్‌దేవుపల్లి గ్రామంలోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ.. పరమశివుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో పాడిపంటలు సమృద్ధిగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీకలుగా నిలుస్తాయని, దేవాలయాల్లో నిర్వహించే ఇలాంటి పూజా కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, సుల్తాన్‌పూర్ సర్పంచ్ బాపు, నారాయణపూర్ సర్పంచ్ గొడుగుల సతీష్, కోమల రెడ్డి, సమ్మయ్య, వినోద్, తిరుపతి రెడ్డి తదితరులతో పాటు గ్రామ మహిళలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.