prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:46 pm Digital Edition : PRAJA VANI

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కొడకండ్ల నూతన ఎస్‌ఐ పిట్టల తిరుపతి ఎమ్మెల్యే తో మర్యాదపూర్వక భేటీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, జె.ఉపేందర్, నవంబర్ 11(ప్రజావాణి): జిల్లా లోని కొడకండ్ల మండల నూతన ఎస్‌ఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పిట్టల తిరుపతి బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు. కొడకండ్ల మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకం కలిగించేలా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, మహిళలు, బాలికలపై ఎలాంటి వేధింపులు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని, గ్రామాల్లో గంజాయి మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తూ మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పోలీసు శాఖ సహకారం ఎంతో అవసరమని, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

ఈ భేటీలో నూతన ఎస్‌ఐ పిట్టల తిరుపతి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కి హామీ ఇచ్చారు.